అధిక రిటైల్ ధరల నుండి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ టమోటాల ధరలను గురువారం నుండి కిలో రూ.80 నుండి రూ.70కి తగ్గించింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) మరియు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ద్వారా ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు కొన్ని ఇతర ముఖ్య నగరాల్లో 80 రూపాయల సబ్సిడీ ధరకు ప్రజలకు కేంద్రం టమోటాలను విక్రయిస్తోంది.కొన్ని చోట్ల కీలకమైన కిచెన్ ఐటెమ్ కిలో రూ. 245 వరకు అమ్ముడవుతున్నప్పటికీ, అఖిల భారత సగటు రిటైల్ ధరలు కిలోకు 120గా ఉన్నాయి. టొమాటో ధరల్లో తగ్గుదల ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని జులై 20, 2023 నుంచి కిలో ధర రూ.70 చొప్పున విక్రయించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎన్‌సిసిఎఫ్ మరియు నాఫెడ్‌లను ఆదేశించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.