ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో విద్యుదాఘాతం కారణంగా 16 మంది మరణించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం తెలిపారు. చమోలి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనలో గాయపడిన ఆరుగురి యోగక్షేమాలను అడిగి తెలుసుకునేందుకు సీఎం ధామి ఎయిమ్స్ రిషికేశ్కు వెళ్లారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించడంపై ఎయిమ్స్ వైద్యుల నుంచి కూడా ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. మృతుల ఆశ్రితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేయాలని ముఖ్యమంత్రి ధామి ఆదేశాలు జారీ చేశారు.