కొరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో గ్రామ సచివాలయం నందు గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పౌర సేవల పత్రాలను అందజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం తో అర్హులైన వారికి మేలు కలుగుతుందని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.