విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను చెప్పుకోలేని విధంగా దూషించారని, ఎంపీ వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆ ఎంపీ తనపై చాలా అసభ్య పదజాలం వాడారన్నారు. తనను చంపేస్తానని కడప భాషలో మాట్లాడారన్నారు. గతంలో కూడా ఒక ఎంపీ తనను లేపేస్తానని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే ప్రధాన మంత్రికి లేఖ రాశానని, ఎంపీ కుటుంబాన్ని కాపాడడానికి గతంలో కూడా తాను లేఖ రాశానని, దానిలో తప్పు ఏముంది.. లేఖ రాయడమే పాపంగా మారిందన్నారు.