ఏపీలో నేటి నుండి ఓటర్ల బాబితా పరిశీలనకు బూత్ లెవల్ ఆఫీసర్స్ ప్రతి ఇంటికీ రానున్నారు. జాబితాలో పేరు లేని వారికి ఓటు నమోదు చేస్తారు. అలాగే, వచ్చే జనవరికి 18 ఏళ్లు నిండే వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 21 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా, అక్టోబర్ 17న ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. నవంబరు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తారు.