పబ్జీలో పరిచయమైన యూపీ యువకుడు సచిన్‌తో కలిసి జీవించేందుకు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. సీమా హైదర్ తన పిల్లలతో కలిసి పాక్ నుంచి ముందుగా నేపాల్‌కు చేరుకన్నారని, తన పేరు ‘ప్రీతి’గా చెప్పుకుని భారత్‌లోకి చొరబడిందని అధికారులు తెలిపారు. నేపాల్‌లోని పోఖారాలో బస్సు ఎక్కినప్పుడు కూడా అదే పేరు చెప్పినట్లు బస్సు నిర్వాహకులు తెలిపారు.