సీనియర్ న్యాయవాది అబ్దుల్ రజాక్ షార్ హత్య కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 24న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 7న జరిగిన ఈ హత్య కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది. ఈ హత్య కేసులో పాక్ మాజీ ప్రధాని హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.