ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోందని ఏపీ విమత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 43.9 అడుగులు, పోలవరం వద్ద 11.97 మీటర్లకు నీటిమట్టం పెరిగిందని తెలిపింది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులు ఉండగా, నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.