ఏపీలోని విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చారు. గతంలో అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ తమ డిమాండ్లపై యాజమాన్యం నిర్ణయం తీసుకోలేదని, అందుకు నిరసనగా సమ్మెకు దిగుతున్నామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఆగస్టు 8న విద్యుత్ సౌధ వద్ద మహా ధర్నా చేపడతామని, ఆగస్టు 10 నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించింది.