ఏపీలోని అర్చకులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వారు శరీరం సహకరించిన వరకు అర్చకులుగా సేవలు చేయవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అర్చకులు పదవీ విరమణ లేకుండా ఆలయాల్లో సేవలు చేయవచ్చు. శరీరం సహకరించకపోతే ఎప్పుడైనా పదవీ విరమణ పొందవచ్చు.