బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి అల్లూరి, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.