రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని లేపాక్షి మండల కేంద్రంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఎలు మాట్లాడుతూ రాష్ట్ర వీఆర్ఎల సంఘం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, వెంటనే జీతాలు పెంచాలని, అర్ములైన వారికి పదోన్నతి కల్పించాలని ఇచ్చిన డీఏల ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.