దేశంలో బిజేపి, రాష్ట్రంలో వైకాపా లను గద్దెదింపడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవర గుడి జగదీష్ అన్నారు. గురువారం పామిడి పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఎన్డీఏ మునిగిపోయే నావలా ఉందన్నారు. వైకాపా, బిజేపిలను గద్దెదింపుదామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు వీరభద్ర స్వామి, నాగరాజు, గోపినాథ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa