ఏపీలో పేదరికం భారీగా తగ్గిందని నీతిఆయోగ్ తెలిపింది. ఏపీ ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని, రాష్ట్ట్రంలో పేదరికం 11.77% నుండి 6.06 శాతానికి తగ్గిందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పురోగతి అద్భుతంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 14.72% నుండి 7.71%కి తగ్గిందని తెలిపింది. రాష్ట్రంలో వంటగ్యాస్ లేని వారి సంఖ్య 37.90% నుండి 16.09 శాతానికి తగ్గిందని నీతిఆయోగ్ కొనియాడింది.