నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని లైఫ్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ డీఎఫ్ క్రాన్ సెక్యూరిటీ సీఈవో భరత్ కూమార్ రెడ్డి తెలిపారు. రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం సీఎస్ఈ, ఏఐఎంఎల్ ఏఐ డీఎస్ విభాగాల ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.