రాజాం నియోజకవర్గములో టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శనివారం కిలో రూ. 140 పైనే పలుకుతున్నాయి. ఇక పప్పులు సంగతి చెప్పక్కర్లేదు. ఏది కొనాలన్నా కొనుగోలుదారుల కు కష్టాలే మిగులుతున్నాయి. పచ్చిమిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. భారీగా పెరిగిన టమాటా ధర చూసి సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. టమాటా వాడకం చాలామంది మానేయగా, కొంతమంది మాత్రం పావు కిలో వంతున కొనుగోలు చేస్తున్నారు.