బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ కే చెల్లిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం తండ్రి పేరుని, తల్లి, చెల్లిని వాడుకొని వదిలేసిన జగన్ రెడ్డి... సిగ్గులేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు జగన్ పక్కన ఉన్నవారే గతంలో జగన్ లాంటి వాడు నీ కొడుకుగా పుట్టాల్సిన వాడు కాదని రాజశేఖర్ రెడ్డితో అనలేదా అని ప్రశ్నించారు. తన చీకటి బాగోతాలు ప్రజలకు తెలియవన్నట్టు గురివిందగింజలా ఇతరుల్ని వేలెత్తి చూపుతున్నారన్నారు. గతంలో ఎంత మంది కలిసినా తన వెంట్రుక పీకలేరన్న జగన్, ఇప్పుడు ఓటమి భయంతో దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై విషంకక్కడం తప్ప, ప్రజలకు ఇది చేశానని చెప్పుకోలేని దుస్థితే జగన్‌తో బూతులు మాట్లాడిస్తోందన్నారు.