వివేకా హత్య తర్వాత టీడీపీ ఆరోపణలు చేసి సానుభూతితో ఓట్లేయించుకుని జగన్ గెలిచారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ గెలవడం వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలని తెలిపారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ అనుకున్నారని.. షర్మిల ఎంపీ సీటు కోసం వివేకా పట్టుబట్టారని చెప్పారు. వివేకా అడ్డుగా ఉన్నారని హత్య చేశారని మండిపడ్డారు. లోటస్ పాండ్‌లోనే వివేకా మర్డర్ స్కెచ్ వేశారన్నారు. వివేకా హత్య విషయం తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పులివెందులకు వెళ్లాక జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా.. ఇంటికి ఎందుకెళ్లారని నిలదీశారు. హత్య విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లడం ఏంటి అంటూ మండిపడ్డారు. బాబాయి మీద ప్రేమ ఉంటే 11 గంటలకే చేరుకునే వారన్నారు. వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి అంటూ వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.