గిద్దలూరు మండలంలో ఓటర్ల సమగ్ర సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్యలు మాట్లాడారు. ఓటరు సర్వేకు విజయవంతం చేయాలని బీఎల్‌వోలకు అవగాహన కల్పించి నట్లు తెలిపారు. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కలిగేలా దరఖాస్తు చేయిస్తారన్నారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, 100 ఏళ్ల పైబడిన వారి గుర్తింపు, ఒకే ఇంటి నెంబరులో అత్యధిక ఓట్లు ఉంటే పరిశీలిస్తారన్నారు. సర్వీసు ఓటర్లు, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లను సరి చేయడం, దీర్ఘకాలికంగా ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారి ఓట్లను వారి అభిష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో తెలుసుకుంటారన్నారు. ఆగస్టు 21వ తేదీ వరకు సర్వే జరుగుతుందని, ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులు ఉన్నా సరి చేసుకోవచ్చని పేర్కొన్నారు.