ఆదోని నియోజకవర్గంలోని పెద్దకడుబూరు మండలం చిన్నకడుబూరు గ్రామానికి చెందిన ఈరన్న కు ఏనిమిది సంవత్సరాల క్రితం పెద్దకడుబూరుకు చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే ఈరన్న వేధింపులు తాళలేక లక్ష్మి 2021 జనవరి 23న భర్తపై పెద్దకడుబూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఆదోని సెకండ్ అడిషనల్ ఏఎఫ్జెఎం కోర్టు 18ఏళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించినట్లు కోర్టు పోలీసులు తెలిపారు.