'వాహనమిత్ర', 'కాపునేస్తం' లబ్ధిదారులకు ప్రభుత్వం షాకిచ్చింది. కల్లుగీత కార్మికులు, చర్మకారులకిచ్చే సామాజిక పింఛను పొందేవారు వాహనమిత్రకు అనర్హులని తెలిపింది. వాహనమిత్ర పథకాన్ని వృత్తి ప్రాతిపదికగా అమలు చేస్తున్నామని పేర్కొంది. అలాగే, అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు 'కాపునేస్తం' పథకానికి అనర్హులని తెలిపింది. వారి కుటుంబంలో మరొకరు ఈ పథకానికి అర్హులైతే వర్తింపజేస్తామని గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం ఇచ్చింది.