ఉక్రెయిన్ పై తాజాగా రష్యా జరిపిన దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. డొనెట్ స్క్ లోని నియు-యోర్క్ పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల్ దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్ లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. అలాగే మిస్సైళ్లు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.