విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేయడమే కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యమని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. శనివారం ఆమె కూర్మన్నపాలెంలోని ఉక్కు కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి వివరించామన్నారు. రాహుల్ గాంధీకి సమస్యను తెలిపినట్లు చెప్పారు