వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది. ఈ ప్రభావంతో వరదయ్యపాళెం మండలంలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేయగా, జనజీవనం స్తంభించింది. వర్షంతో ఒక్కసారిగా మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.