మాచవరం గ్రామానికి చెందిన ఓ యువకుడి పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటయ్య ఆదివారం తెలిపారు. శుక్రవారం గ్రామానికి చెందిన అత్తలూరి నరేంద్ర అనే యువకుడు ఓ బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని మాచవరం చుట్టుపక్కల పరిసరాలలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa