మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలపై జరిగిన అరాచకాలను, ఒంగోలు పట్టణంలో గిరిజన యువకుడు నవీన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ వినుకొండ నియోజకవర్గ నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో దేశమంతటా సిగ్గుపడే విధంగా స్త్రీలపై జరిగిన అరాచకాన్నికారణమైన వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేశారు.