జీ-20 నాయకుల సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు ఢిల్లీలోని ప్రగతిమైదాన్లో నూతనంగా వేదికను నిర్మించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ నెల 26న ప్రారంభం కానుంది. భారత్లోనే అతి పెద్ద మైస్ (మీటింగ్స్, కాన్ఫరెన్స్, ఇన్సెంటివ్స్, ఎగ్జిబిషన్స్) కేంద్రంగా ఇది సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. సుమారు 123 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ కన్వెన్షన్ సెంటర్లోని మూడవ లెవల్లో 7 వేల మంది కూర్చునేలా సమావేశ మందిరాన్ని నిర్మించారు.