సూడాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. పోర్ట్ సూడాన్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం ధృవీకరించింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యతో కుప్పకూలిందని తెలిపింది. కాగా, ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa