తమిళనాడులోకి కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్పేట ఉలుందాండవర్కు చెందిన సతీష్ కుమార్ (21) అనే యువకుడికి తేని జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని బాలికను నమ్మించి ఊలందూరుపేటకు రప్పించుకున్నాడు. అక్కడ ఆమెతో శారీరకంగా కలిసి దాన్ని వీడియోలు, ఫోటోలుగా తీశాడు. బాలిక కుటుంబీకులకు ఫోన్ చేసి రూ.70 వేలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలు లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు.