ఓ భరతనాట్యం కళాకారిణి భరతనాట్యం చేస్తూ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసింది. నెల్లూరుకు చెందిన భవ్యహాసిని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని ఆదివారం వేకువ జామున దర్శించుకుంది. అనంతరం 14 కి.మీ. మేర ఉన్న గిరి ప్రదక్షిణ బాటలో భరతనాట్యం చేస్తూ ప్రదక్షిణ పూర్తిచేసింది. ఇది చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రపంచ క్షేమం కోసమే ఇలా నాట్యం చేస్తూ గిరిప్రదక్షిణ పూర్తిచేసినట్లు తెలిపింది.