తమిళనాడులోని కోర్టుల్లో మహాత్మా గాంధీ లేదా తిరువల్లువర్ విగ్రహాలు, చిత్రపటాలను మాత్రమే ఉంచాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబేద్కర్ విగ్రహాలను ఉంచకూడదని తెలిపింది. కోర్టుల్లో అంబేద్కర్ చిత్రపటాలను ఉంచాలని వివిధ న్యాయవాద సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలను తిరస్కరించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ మద్రాస్ హైకోర్టు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.