అమరావతిని సామాజిక అమరావతిగా ఈరోజు పునాది రాయి వేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. నేటి నుంచి ఈ అమరావతి అందరి అమరావతి అని పేర్కొన్నారు. ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాకుండా.. ఇండ్లను కట్టించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని.. వారి కోరిక మేరకు ఇళ్లనిర్మాణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. మొత్తం 50,793 ఇళ్లను కట్టించి ఇస్తామని వెల్లడించారు. పేదలకు అండగా మార్పు మొదలైందన్నారు.