ప్రొద్దుటూరు పరిధి రాజుపాళెం మండలంలోని కూలూరు గ్రామంలో రూ. 1. 31 కోట్లతో అభివృద్ధి పనులను ఏపీకాలుష్య నియంతణ మండలి ముఖ్యకార్యదర్శి బి. శ్రీధర్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. తమ కుటుంబం గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో సీసీ, గ్రావేల్ రోడ్లు, మురుగు కాలువల నిర్మా ణానికి నిధులు మంజూరు చేయించామని శ్రీధర్ తెలిపారు.