అమరావతిలో చేపట్టే 50 వేలకుపైగా ఇళ్ల నిర్మాణ పైలాన్ ను కృష్ణాయపాలెం లేఅవుట్ లో సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చరిత్రలో ఈరోజు మరిచిపోలేనిదని అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, మూడేళ్లపాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేశారని, దేవుడు ఆశీస్సులతో కేసులు గెలిచామని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ కుట్రలు చేశారని విమర్శించారు.