తమిళనాడు సర్కారు ఆ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార డీఎంకే ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చింది. ఈ పథకం ద్వారా దాదాపు 1 కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఏడాది ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లు కేటాయించింది.