జగనన్న సురక్ష పథకంతో అర్హులకు ఉచిత ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు వైస్ఎంపీపీవావిలపల్లి జగన్మోహన్రావు, తహసిల్దార్ టీ. కళ్యాణ చక్రవర్తి అన్నారు. బూరాడ సచివాలయం ఆవరణలో జగనన్న సురక్ష పథకం ధ్రువీకరణ పత్రాలు సోమవారం పంపిణీ చేశారు. వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఎవరికీ ఎటువంటి ధృవీకరణ పత్రాలకావాలో ముందుగా నమోదు చేసుకున్న వారికి ఉచిత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు.