పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రామనవమి అల్లర్ల కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దీదీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాగా, ఈ ఏడాది రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్లపై మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 మధ్య ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.