నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మరణించిన ఘటన చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు. వీరిలో చిన్నవాడైన జగదీష్ ఇంట్లో మంచంపై పడుకున్నాడు. బాలుడి తల్లి జగదీష్‌ను చూడగా అతడి నోట్లో బల్లి ఉంది. దాంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా బాలుడు విగతజీవిగా కనిపించాడు. బల్లి విషం వల్లే చనిపోయి ఉంటాడని వారు తెలిపారు.