మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్కులోని చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. చీతాల కదలికలను పసిగట్టేందుకు వాటి మెడకు రేడియో కాలర్లను కునో జాతీయ పార్కు అధికారులు అమర్చారు. అయితే వీటి వల్లే చీతాలు ప్రాణాలు కోల్పోతున్నాయని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆరు మగ, ఐదు ఆడ చీతాలు ఉన్నాయి.