గంజాయి మురాలు పల్లెల్లో విస్తరించాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ పెద్దలు కోరారు. గంజాయిని కొనుగోలుకు యువత దొంగతనాలకు పాల్పడుతున్నారని అచ్చుతాపురం మండలం ఎం. జె పురం గ్రామస్థులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి కి బానిసలైన కొందరు యువకులను లొంగదీసుకుని మేకలు, గొర్రెలు, కోళ్లు అపహరించి వారికి అందించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. అపరిచిత వ్యక్తులపై దృష్టి పెట్టాలన్నారు