ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని కారణంగా వ్యక్తులకు ఈ ఏడాది లక్ష నోటీసులను పంపించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.50 లక్షలకు మించి ఆదాయం ఉన్నప్పటికి కూడా కొంత మంది రిటర్న్స్ దాఖలు చేయలేదని చెప్పారు. ఈ నోటీసుల పరిశీలన 2024, మార్చిలోపు పూర్తవుతుందని వెల్లడించారు. CBDT వద్ద ప్రస్తుతం ఎటువంటి నోటీసులు లేవన్నారు.