రేషన్ డీలర్ల సమస్యలని తీర్చాలంటూ ధర్నాకి దిగనున్న వారి డిమాండ్లని తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... డీలర్లు ప్రతిపాదించిన డిమాండ్లలో 90 శాతానికి పైగా అంగీకారం తెలిపినట్లు చెప్పారు. డీలర్లకు కమీషన్ పెంచడానికి కృషి చేస్తానన్నారు. 2012 పేరుకుపోయిన అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కమీషన్ బకాయిలను సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.