రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాల్లోనే వీలైనంత వరకు గర్భిణుల ప్రసవాలు జరగాలని, కేవలం హైరిస్క్ కేసులను మాత్రమే జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వైద్య సిబ్బందికి స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖపై విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 3257 వివిధ ప్రొసీజర్లు ఉండగా, వాటిలోని సింపుల్ ప్రొసీజర్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క కేసుకూడా ప్రీ-ఆథరైజేషన్ స్థాయిలో తిరస్కరణకు గురికాకుండా చూడాలన్నారు. తలసేమియా వ్యాధినిర్ధారణకు పెద్ద ఎత్తున స్ర్కీనింగ్ టెస్టు చేపట్టాలనిఆదేశించారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు