కడప ప్రమాదవశాత్తు విద్యుత తీగ లు తగిలి విద్యార్థి మృతి చెందిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే...... మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టకు చెందిన ముక్తియార్ ఖర్జూరా పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి కుమారుడు అష్రఫ్ (15) స్థానిక హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం తమ ఇంటి పక్కన ఉన్న తైలం చెట్ల కొమ్మ లు నరికేందుకు, ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న మరో రెండంతస్థుల ఇంటి పైకి అష్రఫ్ ఎక్కాడు. ఆ ఇంటి పైనే 11 కేవీ విద్యుత తీగలు వెళుతుండటంతో గమనించని అష్రఫ్ అటువైపు వెళ్లగా విద్యుత తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడి కేకలతో చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే జిల్లా వైద్యశాలకు తరలించారు. అప్పటికే అష్రఫ్ మృ తి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబీకులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిస్కం డీఈ రాజశేఖర్‌రెడ్డిని ఆదేశించారు.