ఈ నెల 9,10 తేదీల్లో ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై విజయవాడ అజిత్‌సింగ్ నగర్ శాంతినగర్‌కు చెందిన వలంటీర్ బెగ్గా కోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీఆర్బీ డేటా ప్రకారం.. రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు, అమ్మాయిలను వలంటీర్లు అమ్మేశారని పవన్ ఆరోపించారని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల డేటాను సేకరిస్తున్నారని, ఈ వివరాలను సంఘ విద్రోహులకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల పేపర్ క్లిప్పింగులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. తమ విధుల్లో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పుడు అందరూ ఈ విషయంపై ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన పరువుకు భంగం వాటిల్లుతోందని, కాబట్టి పవన్‌పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు.