మణిపూర్‌లో ప్రతిపక్షాలు కోరినంత కాలం చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పార్లమెంటులో అన్నారు. మణిపూర్‌పై చర్చకు ఎంత వరకైనా నేను సిద్ధంగా ఉన్నాను.. ప్రభుత్వం దేనికీ భయపడదు.. మణిపూర్‌పై చర్చలు జరపాలనుకునే వారు చేయవచ్చు. పార్లమెంట్ ఉభయసభల్లోని ప్రతిపక్ష నేతలకు లేఖలు రాశామని ఆయన తెలిపారు. మణిపూర్ లాంటి సున్నితమైన అంశంపై చర్చకు తగిన వాతావరణం కల్పించాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. లోక్‌సభలో మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై జరిగిన లఘు చర్చకు సమాధానమిస్తూ మంగళవారం షా ఈ వ్యాఖ్యలు చేశారు.