అప్పుల మీద అప్పులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకుంది. మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.1,000 కోట్లను అప్పుగా తీసుకుంది. 12 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా 7.43 శాతం వడ్డీతో ఈ మొత్తాన్ని తీసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణం రూ.29,500 కోట్లకు చేరింది.