రూ.500 నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. రూ.500 నోట్లు రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి స్పష్టత ఇచ్చారు. రూ.500 నోటు రద్దు ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. ఈ మేరకు మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.