పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాపురంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వృద్ధ ముస్లిం దంపతులు అనారోగ్యానికి గురవ్వడంతో ఏలూరులో ఉండే వారి కుమార్తె, మనుమరాలు(20) వచ్చారు. గతంలో ఆ యువతి వెంటపడిన షేక్ ఇమ్రాన్ మంగళవారం తెల్లవారుజామున వారి ఇంటికి వెళ్లి యువతి తాత, తల్లిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తన వెంట రాకపోతే మీ తాతను, తల్లిని చంపేస్తానని బెదిరించి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa