ప్రతి సంవత్సరం జులై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు జరుపుకుంటారు. 1999, జూలై 26న భారత సైన్యం పాక్ సైన్యంపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకలు జరుపుకుంటారు. 1999, మే 3న కార్గిల్ జిల్లాలో భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధం దాదాపు 60 రోజులపాటూ జరిగింది. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత సైన్యం తరిమికొట్టింది.